ఒలింపిక్ విజేతలకు బైజూస్ భారీ నజరానా

ఒలింపిక్ విజేతలకు ప్రముఖ ఎడ్యుటెక్ స్టార్టప్ బైజూస్ భారీ నజరానా ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన నీరజ్ చోప్రాకు రూ. 2 కోట్లు ప్రకటించగా, పతకాలు సాధించిన మిగతా ఆరుగురికి కోటి రూపాయల చొప్పున నగదు బహుమతి ప్రకటించింది. జాతి నిర్మాణంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని బైజూస్ ఫౌండర్, సీఈవో బైజు రవీంద్రన్ పేర్కొన్నారు.
బెంగళూరుకు చెందిన ఎయిర్‌లైన్ సంస్థ స్టార్ ఎయిర్.. టోక్యో ఒలింపిక్ విజేతలకు జీవితకాలం ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. మన ఒలింపిక్ విజేతలకు కృతజ్ఞతలు తెలుపుకోవాలని.. కృషి, అంకితభావం ఉంటే పర్వాతాలను కూడా కదిలించవచ్చని వారు గుర్తు చేశారని స్టార్ ఎయిర్ సీఈవో సిమ్రన్ సింగ్ తివానా అన్నారు. వారికి జీవితాంతం తమ విమానంలో సేవలు అందించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తామన్నారు. మరో విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. దేశానికి స్వర్ణం అందించిన నీరజ్ చోప్రాకు ఏడాది పాటు అపరిమితంగా ఉచిత టికెట్లను అందించనున్నట్టు తెలిపింది.

Share this on your social network: