ఏపీలో కొత్తగా 2,050 కరోనా కేసులు

Published: Sunday August 08, 2021

గడిచిన 24 గంటల్లో  ఏపీలో కొత్తగా 2,050 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి మొత్తం కేసులు 19,82,308కు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 13,531 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,949 యాక్టివ్‌ కేసులున్నాయి. గత 24 గంటల్లో కరోనా నుంచి 2,458 మంది కోలుకున్నారు.

 

చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మృతి చెందారు. అనంతపురం, విశాఖ, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరేసి చొప్పున మృతి చెందారు.