టోక్యో హీరోలకు ఘన స్వాగతం భారీగా తరలివచ్చిన అభిమానులు

Published: Tuesday August 10, 2021

దేశ ఒలింపిక్స్‌లో చరిత్రలోనే టోక్యో క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత జట్టు.. స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా సహా సోమవారం స్వదేశానికి చేరుకుంది. తమ అభిమాన క్రీడాకారులను తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ఎయిర్‌పోర్టులో ఎక్కడలేని కోలాహలం ఏర్పడింది. భారత క్రీడా ప్రాఽథికార సంస్థ (సాయ్‌) డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ ప్రధాన్‌, అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ అదిల్‌ సుమరివాలా ఆధ్వర్యంలోని అధికారుల బృందం ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికింది. స్థానిక రాజకీయ నాయకులతోపాటు, ఫ్యాన్స్‌ ఎయిర్‌పోర్టు లోపల, బయట చప్పట్లు చరుస్తూ మన హీరోలను స్వాగతించారు. ఇక దారి పొడవునా పెద్దఎత్తున బారులు తీరిన ప్రజలు మువ్వన్నెల జెండాలను ప్రదర్శిస్తూ, డోలు, ఇతర బ్యాండు వాయిద్యాలతో హోరెత్తిస్తూ, పాటలు పాడుతూ రెండు వారాలుగా పడిన కఠోర శ్రమను, ఒత్తిడిని మరిచేలా అథ్లెట్లను ఉత్సాహపరిచారు.

 

à°ˆ క్రమంలో ఫ్యాన్స్‌ భౌతిక దూరాన్ని పక్కనపెట్టడంతోపాటు మాస్క్‌లు ధరించడమూ మరిచిపోయారు. ఉత్సాహం ఇనుమడించిన కొందరు అభిమానులు ఎయిర్‌పోర్టు బయట పుషప్స్‌ చేయడం కనిపించింది. ఎయిర్‌పోర్టు లోపల పలువురు ఫ్యాన్స్‌ నీరజ్‌ చోప్రా సహా ఇతర పతక విజేతలతో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. పురుషులు, మహిళల హాకీ జట్లను చూడగానే పెద్దపెట్టున నినాదాలు చేశారు. ‘మా హీరోలను స్వాగతించేందుకు ఇక్కడకు వచ్చాం. వారిని చూసి ఎంతో గర్వపడుతున్నాం’ అని యువ మహిళా అథ్లెట్‌ ఒకరు చెప్పారు.  ఎస్‌యూవీ పైభాగాన్ని తెరిచి కాంస్య పతక రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియా ఫ్యాన్స్‌కు చేతులు ఊపగా.. ఒక్కసారిగా దూసుకొచ్చిన వారు అతడి వాహనం వెంట పరుగులు తీశారు. ‘వచ్చేసారి మేం ఇంకా మంచి ప్రదర్శన చేస్తాం. పోటీల సమయంలో నాకు మోకాలి గాయం సమస్య ఎదురైంది’ అని పసిడి పతక ఫేవరెట్‌à°—à°¾ దిగిన బజ్‌రంగ్‌ చెప్పాడు. ఇక ఎయిర్‌పోర్టు లోపల.. విమానాశ్రయ అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి, బొకేలు ఇచ్చి అథ్లెట్లను సాదరంగా స్వాగతించారు. ‘ఇంత భారీ స్వాగతాన్ని తొలిసారి చూస్తున్నాం. ఎంతో గొప్ప అనుభూతి కలిగిస్తోంది’ అని రేస్‌వాకర్‌ కేటీ ఇర్ఫాన్‌ తెలిపాడు.

 

ఒలింపిక్స్‌లో 20 à°•à°¿.మీ., రేస్‌వాక్‌లో అతడు తలపడిన సంగతి తెలిసిందే. 2012 క్రీడల్లో ఆరు పతకాలు సాధించిన భారత్‌..టోక్యోలో à°’à°• స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో మొత్తం ఏడు మెడల్స్‌తో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. విశ్వక్రీడలకు భారత్‌ మొదటిసారి 120 మందితో అతి పెద్ద బృందాన్ని బరిలో దించింది. ‘నీరజ్‌ చోప్రా స్వర్ణం, రవి దహియా రజతం సాధించడం దేశానికి, హరియాణా రాష్ట్రానికి గర్వ కారణం. పాలు, పెరుగు తినాలి. హరియాణా నెంబర్‌ వన్‌ కావాలి’ అని అథ్లెట్లను స్వాగతించేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చిన à°† రాష్ట్ర కాంగ్రెస్‌ నేత దీపిందర్‌ సింగ్‌ హుడా వ్యాఖ్యానించారు. 

టోక్యో ఒలింపిక్స్‌లో మన అథ్లెట ప్రతిభ దేశ క్రీడా సత్తాకు నిదర్శనంగా క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అభివర్ణించారు. విశ్వక్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లను సాయంత్రం ఇక్కడ ఘనంగా సన్మానించారు. à°ˆ సందర్భంగా అనురాగ్‌ ప్రసంగిస్తూ.. ‘టోక్యో గేమ్స్‌ భారత క్రీడా చరిత్రలో ఎన్నో మైలురాళ్లకు వేదికైంది. ఒలింపిక్స్‌లో మన విజయం నయా భారత్‌ క్రీడా రంగంలోనూ ఆధిపత్యం చూపగలదని నిరూపించింది’ అని ఆయన అన్నారు.

పతక విజేతలకు మంత్రి శాలువాలు కప్పి సన్మానించడంతో పాటు మెమొం టోలు అందజేశారు. న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ..‘ఇది ఆరంభం మాత్రమే. క్రీడల్లో భారత్‌ శక్తిగా ఎదుగుతోంది. 2028 ఒలింపిక్స్‌ కల్లా అగ్రగా మిగా మారడం ఖాయం’ అని ధీమా వ్యక్తం జేశారు. ఇంతకుముందే స్వదేశానికి చేరుకున్న సింధు, వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను à°ˆ కార్యక్రమానికి హాజరు కాలేదు. అత్యంత ఆహ్లాదభరితంగా సాగిన కార్యక్రమంలో తొలుత కాంస్య పతకం నెగ్గిన పురుషుల హాకీ జట్టుతో పాటు మహిళల జట్టు కేక్‌ కట్‌ చేసింది.