నా దేశాన్ని కాపాడండి: ప్రముఖ క్రికెటర్ ఆవేదన

Published: Wednesday August 11, 2021

 à°¸à±à°¦à±€à°°à±à°˜ కాలం అనంతరం ఆఫ్ఘనిస్తాన్‌లోని తమ బలగాలను అమెరికా, నాటో విరమించుకుంది. అయితే అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ అగ్నిగుండంలా మారింది. ఇంతకు ముందు కూడా ఆఫ్ఘన్‌లో దాడులు, అల్లర్లు జరుగుతూనే ఉండేవి. అయితే అమెరికా, నాటో దళాలు à°† దేశం నుంచి వెనుదిరిగిన వెంటనే తీవ్ర స్థాయికి పెరిగాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో తాలిబన్లు జరుపుతున్న దాడులకు అనేక మంది ఆఫ్ఘన్ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై ఆఫ్ఘన్ క్రికెట్ స్టార్ రషీద్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తమ దేశాన్ని కాపాడాలంటూ వేడుకున్నాడు. దేశంలో అల్లకల్లోక పరిస్థితుల కారణంగా పిల్లలు, మహిళలు సహా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి పరిస్థితుల నుంచి తమ దేశాన్ని కాపాడాలంటూ విజ్ణప్తి చేసుకున్నాడు.

 

మంగళవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘ప్రపంచ నేతలారా.. నా దేశం అల్లకల్లోలంలో ఉంది. పిల్లలు, మహిళలు సహా వేలాది మంది అమాయక ప్రజలు ప్రతిరోజు చనిపోతున్నారు. ఇళ్లు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. వేలాది కుటుంబాలు నిరాశ్రాయులయ్యాయి. మమ్మల్ని à°ˆ కల్లోలంలోనే వదిలేయకండి. ఆఫ్ఘన్ ప్రజలను చంపడాన్ని, ఆఫ్ఘనిస్తాన్‌పై జరుగుతున్న దాడిని అడ్డుకోండి. మాకు శాంతి కావాలి’’ అని ట్వీట్ చేశాడు.