ఏపీలో కొత్తగా 1,859 కరోనా కేసులు

Published: Thursday August 12, 2021

గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,859 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 19,88,910కు పాజిటివ్‌ కేసులు చేరాయి. 24 గంటల్లో 13 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా 13,595 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 18,688 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటవరకు కరోనా నుంచి మొత్తం 19,56,627 మంది రికవరీ అయ్యారు. గత 24 గంటల్లో 70,757 శాంపిల్స్‌ సేకరించారు. 24 గంటల్లో 1,575 మంది కరోనా నుంచి కోలుకున్నారు