భారత్‌ జోలికొస్తే దీటైన జవాబు

Published: Friday August 13, 2021

 à°®à°¨ దేశాన్ని అత్యుత్తమంగా, సౌభాగ్యవంతంగా తీర్చిదిద్దాలని, మనం ఇతరులపై ముందుగా దాడి చేయకపోయినా, మనపై కన్ను వేసినవారికి దీటైన జవాబు ఇచ్చేవిధంగా అభివృద్ధి చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 75à°µ స్వాతంత్ర్య దినోత్సవాల నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ, సాయుధ దళాలు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. 

 

రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, 2047లో మన దేశం 100à°µ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటుందని చెప్పారు. 2047నాటికి ఎలాంటి భారత దేశాన్ని మనం నిర్మించాలని ప్రశ్నించారు. ఒకే భారత దేశం, శ్రేష్ఠమైన భారత దేశంగా ఎదగాలన్నారు. సౌభాగ్యవంతమైన, స్వయం సమృద్ధి సాధించిన, ఆత్మ గౌరవంగల దేశంగా భారత దేశాన్ని తీర్చిదిద్దాలని చెప్పారు. 

 

75 ఏళ్ళకు పూర్వం మన దేశ స్వాతంత్ర్య సమర యోధులు అవసరమైనపుడు పర్వతాల్లో ఆశ్రయం పొందేవారన్నారు. నేడు మన దేశం అవే పర్వతాలపై మౌంటెయిన్ కాంపెయిన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఆజాదీ à°•à°¾ అమృత్ మహోత్సవ్‌  కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత సైన్యం పర్వతారోహణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

 

రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) ఆజాదీ à°•à°¾ అమృత్ మహోత్సవ్‌ కార్యక్రమాల్లో భాగంగా ఆగస్టు 15à°¨ 100 దీవుల్లో జాతీయ జెండాను ఎగురవేస్తుంది. 

 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యానంతరం మన దేశం దాడులను ఎదుర్కొందన్నారు. కలిసికట్టుగా పని చేయడానికి మన సాయుధ దళాలు, ఇతర భద్రతా సంస్థలు తమ శక్తి, సామర్థ్యాలను పెంచుకున్నాయన్నారు. భారత దేశం శాంతికాముక దేశమని తెలిపారు. మన దేశం కొన్ని పరిస్థితులను ఎదుర్కొందని, యుద్ధం కోసం మన దళాలకు శిక్షణ ఇవ్వాలన్నారు.