ఏపీలో కొత్తగా 909 కరోనా కేసులు

Published: Monday August 16, 2021

రాష్ట్రంలో కరోనా ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 909 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో మొత్తం 19,94,606కు పాజిటివ్‌ కేసులు సంఖ్య చేరింది. 24 గంటల్లో  కరోనాతో 13 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 13,660 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,218 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి మొత్తం 19,63,728 మంది రికవరీ అయ్యారు. గత 24 గంటల్లో 46,962 శాంపిల్స్‌ సేకరించారు. 24 గంటల్లో కరోనా నుంచి 1,543 మంది కోలుకున్నారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశంలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, కడప, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.