ముంచుకొస్తున్న ముప్పు

Published: Tuesday August 24, 2021

అఫ్ఘానిస్తాన్‌లో మతోన్మాద తాలిబాన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు తమ సంతోషాన్ని దాచుకోలేకపోతున్నాయి. à°—à°¤ కొన్నేళ్లుగా మతతత్వ శక్తులతో చేతులు కలిపి ఓట్లు దండుకున్న కుహనా లౌకిక వాద పార్టీలు అఫ్ఘాన్‌లో పరిణామాలపై నిక్కచ్చిగా వ్యాఖ్యానించలేకపోతున్నాయి. పైగా జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ నుంచి సమాజ్ వాది పార్టీ ఎంపీ వరకు తాలిబాన్లకు బహిరంగంగా మద్దతు నిచ్చేందుకు ముందుకువస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకున్న కొన్ని పార్టీల నేతలు కూడా తాలిబాన్లకు à°…à°‚à°¡à°—à°¾ నిలుస్తున్నారు. అఫ్ఘానిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలు ఇవాళ ప్రపంచ దేశాలన్నిటికీ దిగ్భ్రాంతి కలుగచేస్తున్నాయి. అక్కడ వేలాది ప్రజలు మతోన్మాదులనుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రాణాలు à°…à°° చేతుల్లో పట్టుకుని పరుగులు తీస్తుండగా, తాలిబాన్ల ఘాతుకాలనుంచి తప్పించుకోవడానికి అఫ్ఘాన్ మహిళలు చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచ ప్రజల హృదయాలు కరిగిపోతున్నాయి.

 

అఫ్ఘానిస్తాన్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు భారత దేశం ఎప్పడూ సహాయపడుతూనే వస్తోంది. 2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అఫ్ఘానిస్తాన్ అభ్యున్నతికి సహాయాన్ని ముమ్మరం చేశారు. అఫ్ఘానిస్తాన్‌లో భారత దేశం 300 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. జాతీయ రహదారులతో సహా 400 మౌలికసదుపాయాల ప్రాజెక్టులకు సహాయం చేసింది. అఫ్ఘాన్‌లో భారతదేశం నిర్మించిన పార్లమెంట్‌ను 2015లో మోదీయే ప్రారంభించారు. ఆఫ్ఘాన్‌లో ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేశారు. అంతే కాక ప్రతిపక్షాలకు పరిస్థితిని వివరించేందుకు గురువారం నాడు అఖిలపక్షసమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

 

పాకిస్థాన్ క్రియాశీలక మద్దతు లేకుండా అఫ్ఘానిస్తాన్ పై తాలిబాన్ల పట్టు పెరగడం సాధ్యం కాదని ప్రపంచ దేశాలకు అర్థమవుతోంది. పాకిస్థాన్ ప్రత్యేక సాయుధ దళాలు, ఐఎస్‌ఐ తాలిబాన్లకు మార్గదర్శకత్వం అందిస్తున్నాయని పదవీచ్యుతుడైన అఫ్ఘాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలే వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశంలో ప్రతిపక్షాలు ఏ విధంగా వ్యవహరించాలి? అంతర్గతంగానూ, బహిర్గతంగానూ ముంచుకొస్తున్న మతోన్మాద ఉగ్రవాద ముప్పును భారత ప్రజలు కలిసికట్టుగా ఎదుర్కోవాలి. à°ˆ విషయంలో మోదీ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు పూర్తి అండదండలు ఇవ్వాలి. అటువంటి సహాయ వైఖరిని మన విపక్షాలు ప్రదర్శిస్తున్నాయా? అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా పాఠాలు నేర్చుకున్నట్లే కశ్మీర్‌లో కేంద్రప్రభుత్వం పాఠాలు నేర్చుకోవాలని కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. అంటే ఆమె కశ్మీర్‌ను భారత భూభాగంగా భావించడం లేదన్నమాట. పైగా తమను పరీక్షించవద్దని ఆమె హెచ్చరించారంటే మతోన్మాద ఉగ్రవాద శక్తులతో ఆమెకున్న అనుబంధం అర్థమవుతోంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న ఏఐయుడిఎఫ్ ప్రధాన కార్యదర్శి కూడా అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్ పాలనను సమర్థించారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏఐయుడిఎఫ్‌తో తన సంబంధాలను కొనసాగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో సంభల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సమాజ్ వాది పార్టీ ఎంపి షఫీఖుర్ రహ్మాన్ బుర్ఖ్ బహిరంగంగా తాలిబాన్లకు మద్దతు పలికారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో జరిగినట్లే తాలిబాన్లు అఫ్ఘానిస్తాన్ ప్రజల స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. అఫ్ఘానిస్తాన్‌ను స్వాధీన పరుచుకున్నందుకు à°…à°–à°¿à°² భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సెక్రటరీ మౌలానా ఉమ్రయిన్ మహఫుజ్ రహ్మానీ తాలిబాన్లను ప్రశంసించారు. ఇక మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అఫ్ఘానిస్తాన్‌లో మహిళలపై జరిగే అత్యాచారాల కన్నా భారత దేశంలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నట్లు వ్యాఖ్యానించారు