మానవాళికి పొంచి ఉన్న మరో ముప్పు..

2080 ప్రాంతాల్లో ప్రపంచాన్ని మరో మహమ్మారి కబళిస్తుందని, ఇది కూడా కరోనా స్థాయిలోనే ప్రజలను భయపెడుతుందని ఈ పరిశోధకులు చెప్తున్నారు. గడిచిన నాలుగు శతాబ్దాలలో మానవాళిని భయపెట్టిన ప్లేగ్, స్మాల్ పాక్స్, టైఫస్, కలరా, ఇన్‌ఫ్లూయెంజా వంటి వ్యాధులను వీరు విశ్లేషించారు. 1918 నుంచి 1920 మధ్య ప్రపంచం మొత్తం వ్యాపించిన స్పానిష్ ఫ్లూ కారణంగా సుమారు 30 మిలియన్ల మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చూసుకుంటే ఇలాంటి మహమ్మారులు మళ్లీ పుట్టే సంభావ్యత ఏడాదికి 0.3 శాతం నుంచి ఏకంగా 1.9 శాతానికి పెరిగిందట.
అంటే స్పానిష్ ఫ్లూ స్థాయిలో మరో మహమ్మారి వచ్చే 400 ఏళ్లలో మరోసారి ప్రపంచంపై పంజా విసిరే ప్రమాదముందని గతంలో అనుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో కరోనా లేదంటే స్పానిష్ ఫ్లూ స్థాయిలో అవుట్ బ్రేక్స్ జరిగే అవకాశం కూడా చాలా వేగంగా పెరుగుతోందట. గడిచిన 50 ఏళ్లలో కరోనా వైరస్ పాథోజెన్స్ మానవాళిలో ఎలా వ్యాపించాయనే అంశంపై కూడా పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ క్రమంలో పెరిగిన రిస్క్ ఫ్యాక్టర్‌ను దృష్టిలో పెట్టుకొని రానున్న 59 సంవత్సరాలలో కరోనా వంటి మరో మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించనుందని ఈ పరిశోధకులు తేల్చారు.
ఇలాంటి మహమ్మారుల వల్ల మానవాళి పూర్తిగా అంతం అయ్యే ప్రమాదం ఉందా? అనే అంశంపై కూడా పడువా వర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరి అంచనాల ప్రకారం, రానున్న 12 వేల సంవత్సరాల్లో మానవాళిని అంతం చేసే మహమ్మారి సంభవించే అవకాశం ఉందని తేలింది. ఆహారంలో మార్పులు, జనాభా పెరుగుదల, వాతావరణ కాలుష్యం వంటి కారణాల వల్ల ఇలాంటి ప్యాండెమిక్ సంభవించే అవకాశం ఉందని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన విలియం ప్యాన్ అన్నారు. ఈ స్టడీ కేవలం రిస్క్ ఉందా లేదా? అని మాత్రమే అధ్యయనం చేసింది తప్ప, ఇలా జరిగే కారణాలపై దృష్టి పెట్టలేదని ఆయన స్పష్టంచేశారు. అవుట్‌బ్రేక్స్ విషయంలో సాధ్యమైనంత త్వరగా స్పందించాల్సిన అవసరాన్ని, అలాగే వీటిని స్థానిక, అంతర్జాతీయ స్థాయిలో పర్యవేక్షించడం వంటి అంశాల ప్రాధాన్యతను ఈ అధ్యయనం వివరిస్తుందని ఆయన చెప్పారు.

Share this on your social network: