పుట్టిన రోజు శుభాకాంక్షలు': చిరంజీవి

Published: Thursday September 02, 2021

తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు'.. అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆయన సోదరుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి విషెస్ తెలిపారు. ఈరోజు (సెప్టెంబర్ 2) టాలీవుడ్ స్టార్ హీరో, జనసేనాని పవన్ కళ్యాణ్  బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకి పలువురు సినీ, రాజకీయ నాయకులు, అభిమానుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి "చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్, పవన్ కళ్యాణ్. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు. ఆయనతో పాటు మరికొందరు సినీ తారలు పవన్ కళ్యాణ్‌కి ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.