ఏపీలో 1,502 కరోనా కేసులు

Published: Saturday September 04, 2021

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్య అధికారులు బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో కొత్తగా 1,502 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 16 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 20,19,702 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు 19,903 మంది మరణించారు. గత 24 గంటల్లో 1,525 మంది కరోనా నుంచి రికవరీ చెందారు. 

 రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కేసుల సంఖ్య సెంచరీ దాటింది. ఒక్కరోజే 11 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 9 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. జిల్లాలో మొత్తం 67 మంది విద్యార్థులు, 37 మంది టీచర్లతో కలిపి మొత్తం 104కు కరోనా కేసులు చేరాయి.