జానపద కళాకారుడు మొగలయ్యకి పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఆర్థిక సాయం

Published: Sunday September 05, 2021

కిన్నెరపై స్వరాలను పలికిస్తూ గానం చేస్తున్న అరుదైన జానపద కళాకారుడు మొగలయ్యకి పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌  ఆర్థిక సాయం అందజేశారు. తెలంగాణలోని అమ్రాబాద్‌ రిజర్వ్‌  ఫారెస్ట్‌ ప్రాంతానికి చెందిన మొగులయ్యకి తన ట్రస్ట్‌ ‘పవన్‌ కల్యాణ్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌’ నుంచి రూ.2 లక్షలు అందించారు. హైదరాబాద్‌లోని జనసేన పార్ట్టీ కార్యాలయంలో మొగులయ్యకు పవన్‌ చెక్కును అందజేశారు. ఇటీవలే మొగులయ్య ‘భీమ్లా నాయక్‌’ చిత్రంలోని పరిచయ గీతానికి సాకీ ఆలపించడంతోపాటు... ఆ పాటకు 12 మెట్ల కిన్నెర స్వరాల్ని అందించారు. ఈ పాటకు చక్కని గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే!