హీరో సాయితేజ్ ప్రమాదంలో కొత్త కోణం

Published: Saturday September 11, 2021

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదంపై కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సాయితేజ్ బైక్ రేసింగ్‌లో పాల్గొనట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలోని à°“ సీనియర్ నటుడి కుమారుడితో సాయితేజ్ బైక్ రేసింగ్ పెట్టుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరి మధ్య పోటీ పెట్టుకోవడంతో సాయితేజ్ అతివేగంగా వెళ్తూ ప్రమాదానికి గురయ్యారని సమాచారం. రేసింగ్ వల్లే సాయితేజ్ బైక్ ప్రమాదానికి గురైందని అనుమానిస్తున్న పోలీసులు à°† కోణంలో విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీలో కూడా రెండు ద్విచక్రవాహనాలు వేగంగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. శుక్రవారం రాత్రి 7 à°—à°‚à°Ÿà°² 58 నిమిషాలకు సాయితేజ్ దుర్గం చెరువు కేబుల్ బ్రడ్జిపై వెళ్తున్నట్లు సీసీటీవీలో రికార్డు అయింది. 8 గంటలకు కోహినూర్ హోటల్ దాటి ఐకియా వైపు దూసుకెళ్లారు. à°† తర్వాత కొద్ది సేపటికే 8 à°—à°‚à°Ÿà°² 5 నిమిషాలకు బైక్ అదుపుతప్పి సాయితేజ్ కిందపడ్డారు. ప్రమాదానికి గురైన సాయితేజ్‌ను రాత్రి 8 à°—à°‚à°Ÿà°² 26 నిమిషాలకు స్థానికంగా ఉన్న మెడికవర్ ఆస్పత్రికి తరలించారు.

 

 

సాయితేజ్‌పై రాయదుర్గం పోలీసులు ఇప్పటికే ఐపీసీ 336, మోటర్ వెహికల్ యాక్ట్ 184 à°•à°¿à°‚à°¦ రెండు కేసులు నమోదు చేశారు. ఇక ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన బైక్ రైసింగ్ వ్యవహారంపై మాదాపూర్ డీసీపీ దర్యాప్తు చేస్తున్నారు. అయితే బైక్ రేసింగ్ వ్యవహారంపై పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. విచారణ పూర్తి అయ్యాక పోలీసులు ప్రకటన చేసే అవకాశం ఉంది.