అఫ్ఘాన్‌లో శాంతి, సుస్థిరత ఎలా?

అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వంపై పాకిస్థాన్ పెత్తనం పెరుగుతోందా? తాలిబాన్ సర్కారును గుప్పిట్లో పెట్టుకోవాలని పాక్ ప్రయత్నిస్తోందా? అంటే తాజా పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి. అఫ్ఘాన్‌కు చెందిన కీలక సమాచారాన్ని రహస్య పత్రాల రూపంలో పాక్‌కు మూడు విమానాల్లో తరలించాయి. ఈ నెల 7న ఆపద్ధర్మ సర్కారును ప్రకటించిన తాలిబాన్లు.. 9/11 ఉగ్రదాడులు జరిపి 20 ఏళ్లయిన సందర్భంగా శనివారం ప్రభుత్వాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, అఫ్ఘాన్‌కు చెందిన కీలక సమాచారాన్ని పాక్ గూఢచార సంస్థ ఐఎ్‌సఐ మూడు విమానాల్లో తరలించడం వల్లే తాలిబాన్లు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. తాలిబాన్ సర్కారు ఖజానా, అఫ్ఘాన్ సైన్యంపైనా పాకిస్థాన్ పట్టు బిగిస్తోంది.
కాగా, శనివారం అఫ్ఘాన్ అధ్యక్ష భవనంపై తాలిబాన్ జెండాను ఎగురవేశారు. పాక్ తీరుపై తాలిబాన్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా తమ విశ్వసనీయతను పాకిస్థాన్ దెబ్బ తీస్తోందని తాలిబాన్ డిప్యూ టీ రక్షణ మంత్రి ముల్లా ఫజల్ ఆరోపిం చారు. కాగా, పంజ్‌షీర్ రెబెల్స్ నేత, అఫ్ఘాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ సోదరుడు రౌహుల్లా సలే్‌హను తాలిబాన్లు ఉరి తీశారు. అఫ్ఘాన్‌లో తాలిబాన్ల విజయం ఇతర ప్రాంతాల్లో ఉన్న గ్రూపులకు ధైర్యాన్ని ఇస్తుందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ హెచ్చరించారు. కాగా, అమెరికా అధ్యక్షు డు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షిజిన్‌పింగ్‌కు ఫోన్ చేసి పలు అంశాలపై మా ట్లాడారని శ్వేతసౌధం ప్రకటించింది.
అఫ్ఘాన్‌లోని పరిస్థితులను పాకిస్థాన్ నిశితంగా గమనిస్తోంది. పాక్‌కు చెందిన ఐఎ్‌సఐ చీఫ్ లెఫ్టెనెంట్ జనరల్ ఫయాజ్ హమీద్ శనివారం చైనా, ఇరాన్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్ ఇంటెలిజెన్స్ అధినేతలతో సమావేశమైనట్లు తెలిసింది. అఫ్ఘాన్‌లో తాజా పరిస్థితులపైనే చర్చ జరిగిందని.. శాంతి, సుస్థిర నెలకొల్పే దిశగా చేపట్టాల్సిన చర్యలపై చర్చ జరిగినట్లు చెబుతున్నారు. రష్యాకు చెందిన ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు పాక్ మీడియా పేర్కొంది.

Share this on your social network: