ఫేస్‌బుక్ ఓ యువకుడి ప్రాణాలను కాపాడింది.

ఫేస్‌బుక్ కొన్ని కీవర్డ్స్‌పై నిఘా పెట్టడం ఓ యువకుడి ప్రాణాలను కాపాడింది. ఆత్మహత్యకు సిద్ధమైన ఆ యువకుడిని.. పోలీసులు చివరిక్షణంలో కాపాడగలిగారు. ఢిల్లీ సైబర్‌సెల్ డీసీపీ ఆన్యేశ్ రాయ్ కథనం ప్రకారం.. ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశాడు. ‘‘ప్రేమలో విఫలమయ్యా. బ్రేకప్ వల్ల చదువుకోలేక ఎంబీఏను మధ్యలోనే ఆపేశా. ఇక నాకు మరణమే శరణ్యం. ఆత్మహత్య చేసుకుంటున్నా’’ అంటూ ఓ యువకుడు పోస్టు చేశాడు. హింసకు ప్రేరేపించే, నేరాలకు పురిగొల్పే పోస్టులపై చర్యలు తీసుకుంటున్న ఫేస్‌బుక్.. కొన్ని కీవర్డ్స్ ఆధారంగా నిరంతరం నిఘా పెడుతోంది. ఈ క్రమంలో ‘సూసైడ్’ అనే కీవర్డ్‌ను ఆ యువకుడు వాడడంతో.. ఐర్లాండ్‌లోని ఫేస్‌బుక్ కార్యాలయ సిబ్బంది దాన్ని గుర్తించారు. వెంటనే ఐర్లాండ్‌లోని భారత హైకమిషన్‌కు, ఢిల్లీ సైబర్‌సెల్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ యువకుడిని గుర్తించేందుకు తిమార్‌పూర్, దయాళ్‌పూర్, సీలంపూర్ పోలీ్‌సస్టేషన్ల సిబ్బంది రంగంలోకి దిగారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఆ యువకుడు సిగ్నేచర్ బ్రిడ్జి వద్ద ఆత్మహత్యకు సిద్ధమవుతుండగా అడ్డుకుని, కాపాడారు. ఆ తర్వాత వైద్యుడితో కౌన్సెలింగ్ ఇప్పించారు.

Share this on your social network: