సూపర్‌బగ్స్‌కు శిలీంద్రాలతో చెక్‌

Published: Monday September 13, 2021

విచ్చలవిడిగా యాంటీబయాటిక్‌à°² వినియోగం వల్ల.. యాంటీబయాటిక్‌ నిరోధకతను సంతరించుకున్న బ్యాక్టీరియా పుట్టుకొస్తోంది! ఎన్నో దశాబ్దాలుగా మానవాళిని రక్షిస్తూ వస్తున్న యాంటీబయాటిక్‌ ఔషధాలు à°ˆ కొత్తగా పుట్టుకొస్తున్న జగమొండి బ్యాక్టీరియాను నిలువరించలేకపోతున్నాయి. భవిష్యత్తు భయానకంగా కనిపిస్తున్న ఇలాంటి తరుణంలో న్యూజిలాండ్‌కు చెం దిన మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌ సియోక్సీ వైల్స్‌ à°’à°• శుభవార్త చెప్పారు. à°† దేశంలో మాత్రమే కనిపించే à°’à°• ప్రత్యేకమైన శిలీంద్రం.. సరికొత్త, శక్తిమంతమైన యాంటీబయాటిక్‌ ఔషధాల సృష్టికి ఉపయోగపడుతుందంటెన్నారు. శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి à°šà°¿à°•à°¿ త్స, కేన్సర్‌ చికిత్స వంటివాటిని ప్రస్తుతానికి చాలా సులభంగా చేసేస్తున్నారు. దీనికి కారణం శక్తిమంతమైన యాంటిబయాటిక్‌ ఔషధాలు అందుబాటులో ఉండడమే. కానీ.. 2024 నాటికి à°ˆ యాంటిబయాటిక్‌à°² ప్రభావాన్ని ఎదుర్కొని మరీ ఇన్ఫెక్షన్లు కలిగించే మొండి సూక్ష్మజీవులు పెరిగిపోతాయని, ఫలితంగా వా à°Ÿà°¿à°•à°¿ భయపడి, వాటిని నిరోధించే యాంటీబయాటిక్‌ ఔషధాలు లేక సాధారణ శస్త్రచికిత్సలను కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014లోనే హెచ్చరించింది. à°ˆ నేపథ్యంలోనే న్యూజిలాండ్‌లోని అవుటెరువాలో కనిపించే ప్రత్యేకమైన శిలీంద్రాల గురించి సియోక్సీ వైల్స్‌ వెల్లడించారు. à°ˆ శిలీంద్రాలకు మైకోబ్యాక్టీరియాను చంపే శక్తి ఉన్నట్టుగా తమ పరిశోధనలో తేలిందని వైల్స్‌ తెలిపారు. మైకోబ్యాక్టీరియా అంటే చాలా నెమ్మదిగా పెరిగే కుటుంబానికి చెందిన బ్యాక్టీరియా. క్షయను కలిగించే మైకోబ్యాక్టీరియమ్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ à°ˆ కుటుంబానికి చెందినదే. 

తొలితరం యాంటీబయాటిక్స్‌లో అత్యంత శక్తిమంతమైనది, ప్రభావవంతమైనది పెన్సిలిన్‌. అది పెన్సిలియమ్‌ రూబెన్స్‌ అనే శిలీంద్రం నుంచి తయారైనదే. అదే కోవలో న్యూజిలాండ్‌లో కనిపించే à°ˆ శిలీంద్రం కూడా కొత్త యాంటీబయాటిక్‌ ఔషధాల తయారీకి కీలకంగా ఉపయోగపడుతుందని వైల్స్‌ చెబుతున్నారు