కపై UAE కి వచ్చేవాళ్లు ఎంత డబ్బు తీసుకురావచ్చంటే..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) విదేశీయుల రాకపై ప్రయాణ ఆంక్షలను తొలగించడంతో భారీగా సందర్శకులు, ప్రవాసులు ఆ దేశానికి తిరిగి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఫెడరల్ కస్టమ్స్ అథారిటీ తాజాగా ఓ ప్రకటన చేసింది. యూఏఈకి వస్తున్న వారితో పాటు అక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లతున్న వారు తమతో పాటు ఎంత డబ్బు తీసుకెళ్లవచ్చు అనే దానిపై అధికారులు ఈ ప్రకటనతో క్లారిటీ ఇచ్చారు. ప్రయాణికులు ఎంత డబ్బైనా తీసుకెళ్లవచ్చని, దానిపై ఎలాంటి లిమిట్ లేదని అధికారులు స్పష్టం చేశారు. కానీ, 60వేల దిర్హమ్స్(సుమారు రూ. 12లక్షలు) లేదా అంతకంటే ఎక్కువ తీసుకెళ్లిన లేక తెచ్చుకున్న దానిపై కస్టమ్స్ అధికారులకు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 16న(గురువారం) కస్టమ్స్ అథారిటీ ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.
ఇక ఈ నెల ప్రారంభంలో దుబాయ్ కస్టమ్స్ అథారిటీ కూడా ప్రయాణికులు తమతో పాటు తెచ్చుకునే కొన్ని వస్తువులను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో 3వేల దిర్హమ్స్ విలువ గల పర్సనల్ గిఫ్ట్స్, 400 సిగరేట్లు, 50 సిగార్లు, 500 గ్రాముల వరకు పొగాకు పదార్థాలపై కస్టమ్స్ డ్యూటీ ఉండదు. కానీ, ఈ పరిమితులకు మించి ఉంటే వాటిపై కస్టమ్స్ డ్యూటీ కట్టాల్సి ఉంటుంది.
లగేజీలో తీసుకెళ్లడానికి అనుమతి ఉన్న వస్తువులు..
* డిజిటల్ కెమెరాలు, టీవీ, రిసీవర్స్(ఒక్కొక్కటి చొప్పున)
* వ్యక్తిగత క్రీడా పరికరాలు
* పోర్టబుల్ కంప్యూటర్స్, ప్రింటర్స్
* వ్యక్తిగత ఉపయోగం కోసం ఔషధాలు
* మూవీ ప్రొజెక్షన్ పరికరాలు
* రేడియో, సీడీ ప్లేయర్లు
నిషేధిత వస్తువులు..
* మత్తుమందులు
* పాన్‌కు సంబంధించిన మూడిపదార్థాలు(తమలపాకులతో సహా)
* గ్యాంబ్లింగ్ పరికరాలు, యంత్రాలు
* నైలాన్ చేప వలలు
* ఎరుపు రంగును వెదజల్లే లేజర్ పెన్స్
* నకిలీ కరెన్సీ

Share this on your social network: