చైనాలో మరో సంక్షోభం

Published: Tuesday September 28, 2021

కరోనా సంక్షోభం ఇప్పుడిప్పుడే నెమ్మదిస్తోంది. పలు దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. à°ˆ వైరస్‌కు చైనాయే కారణమన్న విషయం క్రమంగా మరుగున పడిపోతోంది. ఇటువంటి సమయంలో.. చైనాలో మరో సంక్షోభం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవర్‌గ్రాండ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కేంద్రంగా ప్రారంభమైన à°“ సమస్య ప్రపంచాన్ని మరోమారు అతలాకుతలం చేయొచ్చనే అందోళన వ్యక్తమవుతోంది. 300 బిలియన్ డాలర్ల అప్పుల భారంతో సతమతమవుతున్న ఎవర్‌గ్రాండ్..à°ˆ మొత్తాన్ని చెల్లించలేమంటూ తాజాగా చేతులెత్తేసింది.  దీంతో..ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీ కుదుపుకు లోనయ్యాయి. షేర్ల ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. భారత్‌పై ఎటువంటి ప్రభావం ఉండబోతోందో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. 

ఎవర్‌గ్రాండ్.. చైనాకు చెందిన à°“ భారీ రియల్ ఎస్టేట్ సంస్థ. 1996లో ఇది ప్రారంభమైంది. ఇప్పటివరకూ చైనాలోని  200 నగరాల్లో 1300కు పైగా ప్రాజెక్టులను చేపట్టింది. చైనాలో రెండో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థగా పేరుగాంచింది. రియల్ ఎస్టేట్‌తో పాటూ విద్యుత్ వాహన à°°à°‚à°—à°‚, థీమ్ పార్క్, పర్యాటకం, వంటి ఇతర రంగాలకూ విస్తరించింది.  à°ˆ కంపెనీ దాదాపు 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఎవర్‌గ్రాండ్.. à°“ ఫుట్‌బాల్ టీమ్‌కు ఓనర్‌గానూ వ్యవహరిస్తోంది. కంపెనీ వ్యవస్థాపకుడు ఝూ జియానిన్ ఒకప్పుడు చైనాలో అత్యంత ధనవంతుల లిస్టులో టాప్ పొజిషన్‌కు వెళ్లారు. 

చైనా రియల్ ఎస్టేట్ మార్కెట్ మంచి బూమ్‌లో ఉన్నప్పుడు ఎవర్‌గ్రాండ్ వరుసగా భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టింది. అప్పులు చేసి మరీ వీటిలో పెట్టుబడులు పెట్టింది. అయితే..ఇటీవల కాలంలో బీజింగ్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగంలో à°•à° à°¿à°¨ నిబంధనలు అమలు చేస్తుండటంతో కంపెనీ పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. నానాటికీ పెరిగిపోతున్న నష్టాల నుంచి ఎలా బయటపడాలో తెలీక అల్లాడిపోతోంది. కంపెనీపై ప్రస్తుతం 22 లక్షల కోట్ల రూపాయల మేర అప్పుల భారం ఉందని తెలుస్తోంది. à°ˆ రుణాలు తీర్చే పరిస్థితిలో తాము లేమంటూ ఎవర్‌గ్రాండ్ ఇటీవల ప్రకటించడంతో..అక్కడి రియల్ మార్కెట్‌పై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. దీని ప్రభావం స్టాక్ మార్కెట్లపైనా పడింది. ప్రపంచం మార్కెట్లు కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.    

 

 

గ్లోబలైజేషన్‌కు చైనా ఆహ్వానం పలికాక..

గ్లోబలైజేషన్ పుణ్యామా అని చైనా రియల్ ఎస్టేట్ à°°à°‚à°—à°‚ దూసుకుపోయింది. మధ్యాదాయ వర్గాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో నగరాల్లో రియల్ ఎస్టేట్ ఆస్తులకు భారీగా డిమాండ్ పెరిగింది. వాటి రేట్లు ఆకాశాన్నంటాయి. ఇది రియల్ ఆస్తుల గాంబ్లింగ్‌‌కు దారితీసింది. తక్కువ ధరకు ఫ్లాట్లు, ఇతర రియల్ ఆస్తులను కొనడం, అధిక ధరకు అమ్మడం.. ఆలా వీలైనంతగా లాభాలు దండుకోవడం.. కొన్నేళ్ల పాటు చైనా రియల్ ఎస్టేట్ రంగలో à°ˆ తీరు కొనసాగింది.

 

చూస్తుండగానే.. వివిధ నగరాల్లో పెద్ద పెద్ద  ఆకాశహర్మ్యాలు వెలిసాయి. ఇది చివరికి à°“ బుడగ లాగా మారి ఎప్పుడు పేలిపోతుందే తెలీని ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఇదంతా ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో à°ˆ సమస్యలకు బ్రేకులు వేసేందుకు.. 3 రెడ్ లైన్స్ పాలిసీ పేరిట మూడు కొత్త నిబంధనలను చైనా ప్రభుత్వం తీసుకొచ్చింది. వీటిని ఉల్లంఘించిన కంపెనీలపై ఆర్థిక ఆంక్షలు విధించడంతో పాటూ భారీ జరిమానాలు కూడా వేస్తామని హెచ్చరించింది. à°ˆ కొత్త రూల్స్ అమలు తరువాత.. ఎవర్ గ్రాండ్ పరిస్థితి తారుమారైంది. 

ఎమిటీ నిబంధనలు..

1. కంపెనీ మొత్తం బకాయిలు..మొత్తం ఆస్తుల విలువలో 70 శాతానికి మించరాదు

2. సమీప భవిష్యత్తులో చెల్లించాల్సిన అప్పులకు సరిపడా లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ కంపెనీ వద్ద ఉండాలి.

3. డెట్ టూ ఈక్విటీ నిష్పత్తి వంటి గేరింగ్ రేషియోలు 100 శాతానికి మించకూడదు. 

 

à°ˆ మూడు నిబంధనలూ పాటించే కంపెనీ ప్రతి ఏటా తాము తీసుకునే రుణమొత్తాన్ని 15 శాతం మేర పెంచుకోవచ్చు. అటువంటి కంపెనీని ప్రభుత్వం గ్రీన్ క్యాటగిరీలో చేరుస్తుంది. రెండు లేదా ఒకే నిబంధనను పాటించగలిగిన సంస్థలు 10  లేదా 5 శాతం మధ్య రుణమొత్తాన్ని పెంచుకోవచ్చు. à°ˆ మూడు నిబంధనలూ పాటించలేని సంస్థ రెడ్ కేటగిరీలోకి వెళుతుంది. ఇటువంటి కంపెనీ.. మార్కెట్ నుంచి రుణాలను సేకరించడం దుర్లభమైపోతుంది. ప్రస్తుతం ఎవర్‌గ్రాండ్ ఇదే పరిస్థితి ఎదుర్కుంటోంది. రుణాలు సేకరించడం కష్టంగా మారడంతో ఎవర్‌గ్రాండ్‌ దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. 

à°ˆ సంక్షోభం ఏ రూపు తీసుకుంటుందనేది చైనా ప్రభుత్వ నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవర్‌గ్రాండ్‌ను కాపాడేందుకు బెయిల్ అవుట్ ప్యాకేజీ à°•à°¿à°‚à°¦ లేదా మరో రూపంలో నిధులు అందజేయాలని వారు సూచిస్తున్నారు. అయితే..ఇందుకు అవకాశం చాలా తక్కువని మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎవర్‌గ్రాండ్‌ను ప్రభుత్వం ఆదుకుంటే.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. 

మరోవైపు.. ఎవర్‌గ్రాండ్ à°ˆ ఏడాది ఏకంగా 37 బిలియన్ డాలర్లను వడ్డీ రూపంలో చెల్లించాలి. ఇప్పటికే à°† కంపెనీ 15 లక్షల మంది కస్టమర్ల నుంచి భారీగా అడ్వాన్సులు స్వీకరించింది. ఇక.. ఎవర్‌గ్రాండ్ కష్టాల్లో ఉన్న విషయం బయటకు రాగానే..కంపెనీ జారీ చేసిన బాండ్ల విలువ పడిపోయి నిధుల సమీకరణకు అంతరాయం ఏర్పటింది. ఆస్తులను అమ్మకం పెడదామన్నా కూడా కంపెనీ ఆశించిన స్థాయిలో ఆదాయం వచ్చే స్థితి కనిపించట్లేదు.  à°ˆ నేపథ్యంలో ఎవర్‌గ్రాండ్.. తన కస్టమర్ల నిధులను దారి మళ్లించకుండా ఉండేందుకు చైనా ప్రభుత్వం కస్టోడియన్లను కూడా నియమించింది. కస్టమర్లకు వాగ్దానం చేసినట్టుగా కంపెనీతో à°ˆ ప్రాజెక్టులను పూర్తి చేయడమే à°ˆ కస్టోడియన్ల విధి