ను యాక్షన్, కట్ అంటే వెళ్లిపోయే వాడిని కాదు. నా సహనాన్ని ఇక పరీక్షించొద్దు
Published: Saturday October 02, 2021

ఏపీప్రభుత్వం జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మధ్య మాటల తూటాలు ఇంకా పేలుతూనే ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో బాలాజీపేట రోడ్డుకు శ్రమదానం చేసిన తర్వాత బహిరంగ సభలో పవన్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ నేను యాక్షన్, కట్ అంటే వెళ్లిపోయే వాడిని కాదు. నా సహనాన్ని ఇక పరీక్షించొద్దు. కనీసం రెండు దశాబ్దాలు నాతో ప్రయాణం చేయగలిగితేనే జనసేనలోకి రండి. నేను తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టలేనని బెట్టింగులు కట్టారు. నాపై నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దు. ఇవి మెతక లీడర్లు ఉన్న రోజులు కావు. రాష్ట్ర రాజకీయాలు రెండిళ్ల మధ్య జరిగితే కుదరదు’’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఒక కులాన్ని వర్గ శత్రువుగా చేసుకుని వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ధ్వజమెత్తారు. అందుకే రోడ్లు లేవు, జీతాలు, పెన్షన్లురావని విమర్శించారు. తాను బైబిల్ చేత్తో పట్టుకుని తిరిగేవాడిని కాదని, గుండెల్లో పెట్టుకుంటానని తెలిపారు. కాపు, ఒంటరి, తెలగ, బలిజలు ముందుకు వస్తే తప్ప రాష్ట్ర రాజకీయాల్లో మార్పురాదని స్పష్టం చేశారు. నాలుగు కులాలు పెద్దన్నపాత్ర పోషిస్తే తప్ప మిగిలిన కులాలకు సాధికారిత రాదని పవన్ కల్యాణ్ తెలిపారు.

Share this on your social network: