పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్‌ ప్లాన్‌

Published: Wednesday October 13, 2021

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్‌ ప్లాన్‌ను ఆవిష్కరించారు. భారత దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఉమ్మడి మార్గంలోకి తేవడమే లక్ష్యంగా మల్టీ మోడల్ కనెక్టివిటీ కోసం à°ˆ పథకాన్ని రూపొందించారు. దేశ మౌలిక సదుపాయాల దృశ్యానికి à°ˆ పథకం చారిత్రకమైనదని ప్రభుత్వం చెప్తోంది. à°—తిశక్తి ప్రాజెక్టు శాఖాపరమైన లోపాలను అధిగమిస్తుందని, ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించినవారందరికీ పరిపూర్ణమైన ప్రణాళికను వ్యవస్థీకృతం చేస్తుందని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) తెలిపింది. దేశ మౌలిక సదుపాయాల రంగంలో ఇది చారిత్రక పథకమని వివరించింది. 16 కేంద్ర మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన ప్రస్తుత, ప్లాన్‌డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్యకలాపాల కోసం à°“ కేంద్రీకృత పోర్టల్‌ను à°ˆ పథకం క్రింద ఏర్పాటు చేస్తారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల సృష్టి, లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గుదల, సప్లయ్ చైన్స్ మెరుగుదల, అంతర్జాతీయ పోటీకి స్థానిక వస్తువులు నిలవడం వంటివి గతిశక్తి వల్ల సాధ్యమవుతాయని ప్రభుత్వం చెప్తోంది. వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఇన్‌కార్పొరేట్ చేసి, ఉమ్మడి విజన్‌తో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను డిజైన్ చేసి, అమలు చేయడం గతిశక్తి ఉద్దేశం.పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అమలుకు రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు.