బాధ్యతలు స్వీకరించిన విష్ణు

Published: Wednesday October 13, 2021

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు ‘మా’ కార్యాలయంలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. నరేష్‌ నుంచి నూతన బాధ్యతలు తీసుకున్న ఆయన బుధవారం నుంచి అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. పెన్షన్‌ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. పాజిటివ్‌గా ముందుకెళ్లాలనుకుంటున్నా. వీలైనంత సపోర్ట్‌ చేయండి’’ అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోపక్క మంగళవారం ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి గెలుపొందిన సభ్యులంతా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దానిపై విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి.