డెలివరీ మహిళలకు రెండు రోజుల నెలసరి సెలవులు

Published: Friday October 22, 2021

మహిళ-పురుషులు శక్తిలో మేధస్సుల్లో సరిసమానమే అయినప్పటికీ చాలా కొన్ని విషయాల్లో ఇద్దరికీ తేడాలు ఉంటాయి. ముఖ్యంగా నెలసరితో మహిళలు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగ సమయాల్లో వేరే ఇతర కారణాలతో బయట ఉండాల్సిన సమయంలో ఈ సమస్య మరింత ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఈ విషయాన్ని బయటికి చెప్పేందుకు సంకోచిస్తుంటారు. సమాజంలో పేరుకుపోయిన కొన్ని కారణాల వల్ల బయటికి చెప్తే ఏం అనుకుంటారో అనే అనుమానాలు చాలా మందికి ఉంటాయి. మహిళల్లో చాలా మంది ఈ ఇబ్బందుల్తోనే తమ పని చేసుకుంటూ వస్తుంటారు.

 

 

పెద్ద సంఖ్యలో కాకపోయినా కొద్ది మంది ఈ విషయమై కొన్ని డిమాండ్లు పెట్టారు. మహిళలకు ప్రసూతి సెలవులతో పాటు నెలసరి సెలవులు కూడా ఇవ్వాలని చాలా కాలంగానే అడుగుతున్నారు. అటు ప్రభుత్వాలు కానీ, ఇటు ప్రైవేటు యాజమాన్యాలు కానీ దీనిపై దృష్టి సారించలేదు. మహిళలు అధినేతలుగా ఉన్న కార్యాలయాల్లోని మహిళా ఉద్యోగులు కూడా నెలసరి సెలవులు సంపాదించలేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

అయితే మొదటిసారిగా ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ à°ˆ పరిస్థితిని అర్థం చేసుకుంది. తమ సంస్థలో పని చేస్తున్న డెలివరీ మహిళలకు ప్రతి నెలా రెండు రోజుల పాటు నెలసరి సెలవులు ప్రకటించింది. స్విగ్గీ తీసుకున్న à°ˆ నిర్ణయంపై పెద్ద స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. à°ˆ విషయమై స్విగ్గీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ మిహిర్ à°·à°¾ తన బ్లాగ్‌ ద్వారా స్పందిస్తూ ‘‘నెలసరి సమయంలో బయటకు రావాలన్నా.. రోడ్లపై తిరగాలన్నీ మహిళలు చాలా అసౌకర్యానికి గురవుతారు. డెలివరీ లాంటి ఉద్యోగాల్ని తమ వృత్తిగా మహిళలు ఎంచుకోకపోవడానికి ప్రధాన కారణం ఇది. అలాంటి మహిళలకు à°…à°‚à°¡à°—à°¾ ఉండాలని మేం నిర్ణయం తీసుకున్నాం. మహిళలు ఒకడుగు ముందుకు వేసినప్పుడు మేమెందుకు వేయకూడదు? అందుకే మా సంస్థలో పని చేస్తున్న డెలివరీ మహిళలకు ప్రతి నెలా రెండు రోజుల నెలసరి సెలవులు ప్రకటిస్తున్నాం. à°ˆ సెలవులను ఎలాంటి కారణం చెప్పకుండా తీసుకోవచ్చు’’ అని రాసుకొచ్చారు.

 

ఇది మాత్రమే కాకుండా మహిళల కోసం మరిన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మహిళా భద్రత దృష్ట్యా వారి పని గంటలను సాయంత్రం 6 à°—à°‚à°Ÿà°² వరకే పరిమితం చేయనున్నట్లు ప్రకటించారు. రాత్రి వేళల్లో ఫుడ్ ఆర్డర్స్‌పై డిమాండ్ ఉన్నప్పటికీ మహిళల చేత డెలివరీ చేయించమని స్పష్టం చేశారు. ఫుడ్ డెలివరీలో ప్రఖ్యాతి గాంచిన స్విగ్గీ.. 2016 నుంచి డెలివరీలో మహిళలను తీసుకుంటోంది. పూణె నుంచి ప్రారంభమైన à°ˆ మహిళా డెలివరీ ఏజెంట్లు ప్రస్తుతం దేశంలోని అన్ని నగరాల్లో స్విగ్గీకి ఉన్నారు.