భారీగా గంజాయి పట్టివేత

Published: Saturday October 23, 2021

జిల్లాలోని అనంతగిరి మండలంలో పోలీసులు వాహన తనీఖీలు నిర్వహించారు. కొత్తూరు పంచాయతీ పరిధిలోని దంసరాయి గ్రామ సమీపంలో గంజాయి పట్టుబడింది. బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 12 బస్తాల గంజాయిని అరకులోయ ఆబ్కారీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ‌