చెత్త మీద పన్ను ఎందుకో....

పారిశుధ్యం పట్ల ప్రజల్లో బాధ్యత పెంపొందించడం కోసమే చెత్త మీద పన్ను విధించడం జరిగిందని నగరి ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. సోమవారం పుత్తూరు మున్సిపాలిటీ 15వ వార్డులో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచితం అయితే బాధ్యతగా వుండరనే ఉద్దేశంతోనే రోజుకో రూపాయి వంతున చెత్త పన్ను విధించామన్నారు. ఇందులో ప్రభుత్వం సంపాదించేదేమీ లేదన్నారు
ఇల్లు, వీధి, గ్రామం శుభ్రంగా వుంటే అందరూ ఆరోగ్యంగా వుంటారని చెప్పారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం గురించి వలంటీర్లు, కార్యకర్తలు ప్రజలను చైతన్య పరచాలన్నారు. మహిళలు తడి, పొడి, హానికరమైన చెత్తను వేరుచేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. ఇంటికి చొప్పున మూడు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ హరి, కమిషనర్ వెంకట్రామిరెడ్డి, తహసీల్దారు జయరాములు, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Share this on your social network: