పోప్ ఫ్రాన్సిస్‌ను భారత్‌కు ఆహ్వానించిన మోదీ

Published: Saturday October 30, 2021

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేథలిక్ చర్చ్ అధిపతి పోప్ ఫ్రాన్సిస్‌ను భారత దేశానికి ఆహ్వానించారు. వీరిద్దరూ శనివారం అత్యంత ఆత్మీయంగా సమావేశమయ్యారు. వాతావరణ మార్పులు, పేదరికం వంటి వివిధ అంశాలపై చర్చించారు. షెడ్యూలు ప్రకారం 20 నిమిషాలు జరగవలసిన à°ˆ భేటీ గంటపాటు జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

నరేంద్ర మోదీ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, తాను పోప్ ఫ్రాన్సిస్‌తో అత్యంత ఆత్మీయంగా సమావేశమైనట్లు తెలిపారు. ఆయనతో అనేక అంశాలను చర్చించే అవకాశం లభించిందని పేర్కొన్నారు.  ఆయనను భారత దేశానికి ఆహ్వానించానని తెలిపారు. 

1999లో పోప్ జాన్ పాల్-2 భారత దేశంలో పర్యటించారు. అప్పట్లో అటల్ బిహారీ వాజ్‌పాయి ప్రధాన మంత్రిగా ఉన్నారు. à°† తర్వాత కేథలిక్ చర్చ్ అధిపతి మన దేశంలో పర్యటించలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  తాజాగా పోప్ ఫ్రాన్సిస్‌ను ఆహ్వానించారు. 

జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇటలీ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు.