తైవాన్‌పై మరోసారి యుద్ధమేఘాలు....

Published: Saturday October 30, 2021

తైవాన్‌పై మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. కమ్యూనిస్టు చైనా ఆవిర్భావ దినోత్సవం అక్టోబర్ 1 సందర్భంగా ప్రతి సంవత్సరం తైవాన్‌పై బీజింగ్ పాలకులు కవ్వింపు చర్యలు చేపట్టడం పరిపాటి. à°ˆ ఏడాది తైవాన్‌కు వ్యతిరేకంగా చైనా చాలా దుందుడుకు సైనికవిన్యాసాలకు పాల్పడింది. à°ˆ అక్టోబర్ తొలినాళ్ళలో 150à°•à°¿ పైగా చైనా యుద్ధవిమానాలు తైవాన్ à°—à°—à°¨ రక్షణ పరిధిలోకి చొరబడ్డాయి. ‘ఇది, à°—à°¤ నాలుగు దశాబ్దాలలో తాము చైనా నుంచి ఎదుర్కొన్న అతి కఠినమైన సవాల్’ అని తైవాన్ రక్షణమంత్రి చివు కుఒ-చెంగ్ వ్యాఖ్యానించగా, ‘à°ˆ వైమానిక విన్యాసాలు అవసరమైన చర్య’à°—à°¾ చైనా ప్రభుత్వ తైవాన్ వ్యవహారాల ప్రతినిధి మా షియో గువాంగ్ సమర్థించారు. ‘ ‘మాతృభూమితో తైవాన్ ‘పునరేకీకరణ’ అనివార్యమని, బలప్రయోగానికి సైతం వెనుకాడమని’ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటించారు. ‘బీజింగ్ ఒత్తిళ్ళకు తైవాన్ ఎటువంటి పరిస్థితులలోనూ తలొగ్గదని తన సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటుందని’ తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్-వెన్ స్పష్టం చేశారు. ‘చైనా దుస్సాహసానికి పాల్పడితే తైవాన్ రక్షణకు తమ దేశం కట్టుబడి ఉందని’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. à°ˆ పరిణామాలతో చైనా-తైవాన్ సమస్య మరల అంతర్జాతీయంగా తెరపైకి వచ్చింది. చైనా నిజంగా సైనికచర్యతో తైవాన్‌ను విలీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుందా? సంపూర్ణ స్వాతంత్ర్యం వైపు తైవాన్ అడుగులు వేయగలదా? à°ˆ రెండు కాకుండా యథాతథ స్థితిని కొనసాగించడమే అందరికి శ్రేయస్కరమా? 

 
తైవాన్ ఆక్రమణల చరిత్ర సుదీర్ఘమైనది. సంక్లిష్టమైనది. ప్రారంభానికి వెళితే, తైవాన్ మొట్టమొదటి స్థిరనివాసులు దక్షిణ చైనా నుంచి వలస వెళ్ళిన ఆస్ట్రోనేషియన్ గిరిజనులు. సుదీర్ఘకాలం స్వేచ్ఛాయుత ద్వీపంగా ఉండిన తైవాన్ 1624 నుంచి 1642 వరకు డచ్, పిదప 1662 వరకు స్పెయిన్ వలసగా ఉన్నది. à°† తరువాత చైనా మింగ్ వంశ సామ్రాజ్యంలో భాగమయింది. 1894–95 చైనా-జపాన్ యుద్ధంలో చైనా ఓటమితో జపాన్ ఏలుబడిలోకి వెళ్ళింది. రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన తరవాత 1948లో చాంగ్ కై-షేక్ నాయకత్వంలోని చైనా గణతంత్ర రాజ్యంలో విలీనమయింది. 1949లో చైనాలో కమ్యూనిస్ట్ విప్లవ విజయంతో జాతీయవాద కొమింటాంగ్ ప్రభుత్వం ప్రధాన భూభాగంలో అధికారాన్ని కోల్పోయింది. చాంగ్ కై-షేక్, కొమింటాంగ్ పార్టీ పది లక్షల పైచిలుకు ప్రజలతో తైవాన్‌కు తరలి వెళ్ళి అక్కడ గణతంత్ర చైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తైవాన్‌ను విలీనం చేసుకోవడానికి చైర్మన్ మావో నేతృత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం సన్నద్ధమవుతుండగా 1950లో కొరియా యుద్ధం ప్రజ్వరిల్లి తైవాన్‌పై దండయాత్రను నిరోధించింది. à°ˆ యుద్ధం ఉత్తర కొరియాలోని కమ్యూనిస్టులకు సహాయం చేయడంలో మావోను నిమగ్నం చేయడమే కాకుండా, తైవాన్ భద్రత, స్వాతంత్ర్యానికి కట్టుబడి ఉండటానికి అమెరికాను ప్రోత్సహించింది. ప్రచ్ఛన్న యుద్ధం, తదనంతర కాలంలో కూడా తూర్పు ఆసియాలో చైనా విస్తృతిని నివారించడంలో అమెరికా భౌగోళిక రాజకీయ వ్యూహాలలో తైవాన్ à°’à°• కీలక మిత్రదేశంగా మారింది. à°ˆ విధంగా చైనా కమ్యూనిస్టు విప్లవంలో తైవాన్ విలీనం à°’à°• అసంపూర్ణ అధ్యాయంగా మిగిలిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం తైవాన్‌ను ప్రధాన భూభాగంతో విలీనం చేయడానికి పలు విధాల ప్రయత్నిస్తూనే ఉంది. à°ˆ ప్రక్రియ జిన్‌పింగ్ నాయకత్వంలోనే సాధ్యం కాగలదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

 

1980à°µ దశకంలో చైనా–తైవాన్‌à°² మధ్య సంబంధాలు మెరుగుపడడం మొదలయింది. పునరేకీకరణకు అంగీకరిస్తే తైవాన్‌కు గణనీయమైన స్వయం ప్రతిపత్తిని ఇస్తామని బీజింగ్ పాలకులు హామీ ఇచ్చారు. హాంకాంగ్‌ విషయంలో వలే ‘à°’à°• దేశం, రెండు వ్యవస్థల’ సూత్రాన్ని తైవాన్‌కూ వర్తింప చేస్తామని బీజింగ్ ప్రతిపాదించింది. దానిని తైవాన్ తిరస్కరించినప్పటికీ, ఇరుదేశాల మధ్య పర్యటనలు, పెట్టుబడులు, వాణిజ్యంపై నిబంధనలను సడలించింది. చైనా అనుసరిస్తున్న ‘ఏక చైనా’ విధానం మూలంగా, ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య అధికారిక చర్చలు జరగలేదు కానీ, అనధికార సంప్రదింపులు కొనసాగాయి. 1991లో ప్రధాన భూభాగంతో యుద్ధం ముగిసిందని కూడా తైవాన్ ప్రకటించింది. ఇరుదేశాల మధ్య పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలు గణనీయంగా పెరిగి, తైవాన్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఎదిగింది. 2000 సంవత్సరంలో తైవాన్ అధ్యక్షుడుగా ఎన్నికైన డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నేత చెన్ శుఇ-బియన్ బహిరంగంగా తైవాన్ ‘స్వాతంత్ర్య కాంక్ష’ను సమర్థించాడు. దీంతో చైనా అప్రమత్తమైంది. à°ˆ నేపథ్యంలో, ‘విడిపోవడానికి’ ప్రయత్నిస్తే తైవాన్‌ను నిరోధించేందుకు ‘బలప్రయోగ’ పద్ధతులను ఉపయోగించే హక్కును కల్పిస్తూ చైనా à°’à°• చట్టాన్ని చేసింది. మరల 200à±®–16 సంవత్సరాల మధ్య కాలంలో ఇరుదేశాల మధ్య పలు ఆర్ధిక ఒప్పందాలు కుదిరి సంబంధాలు మెరుగయ్యాయి.