అత్యుత్తమ పాలన ముందుంది

Published: Sunday November 07, 2021

భారతీయ జనతా పార్టీ à°­à°µà°¿à°·à±à°¯à°¤à±à°¤à±à°²à±‹ మరింత అత్యుత్తమ పాలన అందించేందుకు వీలుగా పార్టీ ఆర్గనైజేషన్‌ పటిష్టతకు శ్రేణుంలతా కృషి చేయాలని à°† పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం ఉదయం 10 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో మొదలైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నడ్డా ప్రారంభోపన్యాసం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌à°·à°¾, పలువురు కేంద్ర మంత్రులు, తదితరులు à°ˆ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్ మెంబర్లు వర్చువల్ మీటింగ్ ద్వారా పాల్గొన్నారు. త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడం, పాటు పలు తీర్మానాలు ఆమోదించడం సమావేశం ఎజెండాగా ఉంది

 

జేపీ నడ్డా తన ప్రసంగంలో ఎన్నికలకు సిద్ధమవుతున్న పంజాబ్‌ను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం సిక్కుల కోసం చేపట్టిన పలు చర్యలను వివరించారు. 1984 అల్లర్ల నిందితులపై చర్యలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేశారని చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమయంలో మోదీ సమర్ధ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, 100 కోట్ల వ్యాక్సినేషన్ అందించడంతో పాటు, 80 కోట్ల మంది ప్రజలు ఉచిత ఆహారధాన్యాలను పంపిణీ చేసినట్టు చెప్పారు. మానవాళి చరిత్రలోనే ఇది చాలా పెద్ద 'ఫుడ్ ప్రోగ్రామ్' అని పేర్కొన్నారు.

 

 

పశ్చిమబెంగాల్‌లో 2014లో జరిగిన లోక్‌సభ, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినప్పుడు బీజేపీ ఓట్ షేర్ పెరిగిందని, బెంగాల్‌లో పార్టీ పెరుగుదల గణనీయంగా ఉందని అన్నారు. à°ˆ ఏడాది డిసెంబర్ 25 నాటికి మొత్తం 10.40 లక్షల పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

 

కాగా, పార్టీ రాజకీయ తీర్మానాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ à°ˆ సమావేశంలో ప్రవేశపెట్టారు. సంతాప తీర్మానాన్ని జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ చదివి వినిపించారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం మూడు నెలలకు ఒకసారి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగాల్సి ఉంది. à°—à°¤ ఏడాది కోవిడ్ సంక్షోభం తలెత్తిన అనంతరం బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం కావడం ఇదే మొదటి సారి. ప్రధాని మోదీ ఆదివారం ఉదయం ఎన్‌డీఎంఎస్ కార్యాలయానికి చేరుకోగానే ఛాత్ సంప్రదాయాలతో స్వాగతం పలికిన మహిళలను ఆయన ఆప్యాయంగా పలకరించారు. అనంతరం సభావేదికపై ప్రధానిని తోడ్కొని వచ్చి గజమాల వేయడంతో సమావేశం ప్రారంభమైంది.