ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి

Published: Monday November 08, 2021

 à°†à°—్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో బుధ, గురువారాల్లో దక్షిణకోస్తాలో అక్కడక్కడ అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.