అపోహలే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పుట్టుకకు కారణo

Published: Sunday November 28, 2021

 à°•à°°à±‹à°¨à°¾ టీకా లభ్యతలో పేద, ధనిక దేశాలు మధ్య ఉన్న అంతరాలు, ప్రజల్లో టీకా వినియోగంపై నెలకొన్న అపోహలే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పుట్టుకకు కారణమని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ‘‘దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన à°ˆ కొత్త వేరియంట్ వాస్తవానికి మరో ఆఫ్రికా దేశంలో ఉనికిలోకి వచ్చి ఉండొచ్చు. టీకా లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పుట్టి క్రమంగా దక్షిణాఫ్రికాకు పాకి ఉండవచ్చు. వైరస్‌లో వస్తున్న జన్యుమార్పులపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం గట్టి నిఘా పెట్టడంతో ఒమిక్రాన్ ఉనికి బయటపడి ఉండొచ్చు’’ యూనివర్శిటీ ఆఫ్ సౌంతాప్టన్‌కు చెందిన à°“ సీనియర్ శాస్త్రవేత్త మైఖేల్ హెడ్ తాజాగా వ్యాఖ్యానించారు. ప్రపంచ ప్రజలందరికీ కరోనా టీకా అందడంలో జరిగిన ఆలస్యం ఒమిక్రాన్ పుట్టుకకు సహజకారణమని వ్యాఖ్యానించారు. ఆఫ్రికా ఖండంలోని అనేక దేశాల్లో ఇప్పటికీ మెజారిటీ ప్రజలకు టీకా అందలేదని ఆయన వాపోయారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ధనిక దేశాల్లో 63.9 శాతం మంది ప్రజలు ఇప్పటికే కనీసం ఒక్క డోసు కరోనా టీకా పొందారు. కానీ ఆఫ్రికాలో పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం.. ఆఫ్రికా దేశమైన మలావీలో కనీసం ఒక్క డోసు టీకా పొందిన వారి వాటా మొత్తం జనాభాతో పోలిస్తే కేవలం 5.6 శాతం. మరో ఆఫ్రికా దేశం బోత్సువానాలో టీకా తొలి డోసు పొందిన వారు 37 శాతంగా ఉన్నారు. ధనిక దేశాలు కరోనా టీకాలను తమ వద్దే దాచుకోవడంతో పేద దేశాలు టీకా కొరతతో అలమటిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి తోడు టీకాపై ప్రజల్లో అపోహలు నెలకొనడంతో అనేక మంది కరోనా టీకా తీసుకునేందుకు ముందుకు రావట్లేదని దీని వల్ల కూడా టీకాకరణ మందగించిందని చెబుతున్నారు. కరోనా సంక్షోభం పూర్తిగా సమసిపోలేదని ఒమిక్రాన్ ఉదంతం రుజువు చేసినట్టు మెజారిటీ శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు.