లాక్‌డౌన్లు, వర్క్ ఫ్రమ్ హోమ్‌లు తప్పవా?

‘ఒమైక్రాన్’ కొత్తగా ఇప్పుడు భయపెడుతున్న కరోనా వేరియంట్. దీని వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఉంటుందనే అపోహలు, ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి. దక్షిణాఫ్రికాతో పాటు బెల్జియం, హాంకాంగ్ లాంటి ప్రాంతాల్లో ఒమైక్రాన్‌కు సంబంధించిన కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. ‘‘ఒమైక్రాన్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుంది. ఇప్పటివరకూ ప్రపంచమంతా భయపడిన డెల్టా వేరియంట్ కంటే మరింత భయపెట్టబోతోంది. మరింత ఎక్కువగా ఈ వైరస్ వ్యాప్తి చెందబోతోంది.’’ లాంటి విశ్లేషణలను చూస్తున్నాం. ప్రపంచమంతా కూడా మరోసారి థర్డ్ వేవ్ వచ్చేసినట్టుగా దీన్ని చూడాలనే చర్చలు కూడా చూస్తున్నాం.
దక్షిణాఫ్రికాతో పాటు మిగతా దేశాల్లో ఎక్కడైతే ఈ ఒమైక్రాన్ వైరస్‌ను గుర్తించారో.. ఆ ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా నిషేధించారు. కొన్ని చోట్ల ఆంక్షలు విధించారు. చాలా దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్ తరహా వాతావరణం కూడా వచ్చే పరిస్థితి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ‘‘అసలు ఈ ఒమైక్రాన్ ఏంటి?. ఏ మేరకు వ్యాప్తి చెందబోతోంది. ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టనుంది. కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా ఈ కొత్త వేరియంట్ కు ఎందుకు ప్రపంచం భయపడుతోంది. అంత అవసరం ఏముంది?.

Share this on your social network: