ఢిల్లీలో భారీగా తగ్గిన పెట్రోలు ధర

Published: Wednesday December 01, 2021

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోలుపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గించడంతో లీటరు పెట్రోలు ధర రూ.8 వరకు తగ్గింది. సవరించిన ధరలు బుధవారం-గురువారం అర్ధ రాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. కేజ్రీవాల్ నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.103.97 కాగా దీనిలో సుమారు రూ.8 వరకు తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం నవంబరు మొదటివారంలో దీపావళి పండుగ సందర్భంగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. లీటరు పెట్రోలుపై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్‌ను తగ్గించి, ప్రజలకు ప్రయోజనం కల్పించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.