నాణ్యమైన తేయాకుకు ధర కిలో అక్షరాలా లక్ష రూపాయలు!

Published: Tuesday December 14, 2021

నాణ్యమైన తేయాకుకు ప్రసిద్ధి చెందిన అసోం టీపొడికి వేల రూపాయల ధర పలకడం గతంలో చూశాం. ఈసారి మాత్రం గత రికార్డులను చెరిపేస్తూ చేతితో తయారుచేసిన అత్యంత నాణ్యమైన ఆర్థోడాక్స్ తేయాకు ధర కిలో ఏకంగా లక్ష రూపాయలు పలికి అందరి దృష్టిని ఆకర్షించింది.

 

దిబ్రూగఢ్‌లోని మనోహరి à°Ÿà±€ ఎస్టేట్‌లో పండించిన ‘మనోహరి గోల్డ్’ తేయాకుకు గువాహటి à°Ÿà±€ ఆక్షన్ సెంటర్ (జీటీఏసీ)లో నేడు (మంగళవారం) నిర్వహించిన వేలంలో రూ.99,999 ధర పలికింది. సౌరభ్ à°Ÿà±€ ట్రేడర్స్ à°ˆ తేయాకును దక్కించుకున్నట్టు జీటీఏసీ కార్యదర్శి ప్రియానుజ్ దత్తా తెలిపారు.

 

ఇదే రకం తేయాకు గతేడాది కేజీ రూ. 75 వేలకు అమ్ముడుపోగా, ఇప్పుడు సొంత రికార్డే బద్దలైంది. ఈ తేయాకును కాచేటప్పుడు బంగారం రంగు వస్తుంది కాబట్టే దీనికి ఆ పేరు. అలాగే, ఈ టీలో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

 

తమ తేయాకుకు రికార్డు స్థాయి ధర పలకడం ఇది వరుసగా నాలుగోసారని à°Ÿà±€ ఎస్టేట్‌ యజమాని రాజన్ లోహియా తెలిపారు. ఈసారి à°—à°¤ రికార్డులను చెరిపేస్తూ కిలో తేయాకు ధర రూ.99,999 పలికినట్టు పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా ఈసారి ఉత్పత్తి తగ్గినట్టు చెప్పారు.  వినియోగదారుల నుంచి అధిక డిమాండ్ ఉన్న à°Ÿà±€ పొడిని తాము ఉత్పత్తి చేస్తామని అన్నారు. అసోం à°Ÿà±€ పరిశ్రమ కోల్పోయిన కీర్తిని తిరిగి పొందేందుకు à°ˆ రికార్డు ధర దోహదం చేస్తుందని ఆశిస్తున్నామని రాజన్ తెలిపారు. తేయాకుకు ఇంత ధర పలకడం దేశంలోనే ఇదే తొలిసారన్నారు.

 

మనోహరి గ్రూప్ à°•à°¿à°‚à°¦ ఉన్న మూడు ఎస్టేట్‌లు కలిపి ఏడాదికి 25 కిలోల తేయాను పండిస్తాయి. అయితే, à°ˆ గ్రూపు చేతితో తయారు చేసిన ఆర్థోడాక్స్ తేయాకును మాత్రం 5 కిలోలే తయారు చేస్తుంది. 

 

2018లో మనోహరి గోల్డ్ తేయాకు తొలిసారి రికార్డులకెక్కంది. అప్పట్లో కిలో తేయాకు రూ. 39,001కి అమ్ముడుపోయింది. 2019లో ఇదే రకం తేయాకును రూ. 50 వేలకు విక్రయించింది. గతేడాది వేలంలో రూ. 75 వేల పలకగా, ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయల ధర పలికి దేశం దృష్టిని ఆకర్షించింది.