అమరావతి రైతుల ముగింపు సభకు హైకోర్టు అనుమతి

Published: Wednesday December 15, 2021

అమరావతి రైతుల ముగింపు సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సభ నిర్వహించుకోవాలని ఆదేశించింది. కొవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ సభ జరుపుకోవాలని కోర్టు సూచించింది.

అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది. కొవిడ్ ప్రొటోకాల్ ప్రకారం సభకు అనుమతి ఇవ్వాలని పరిరక్షణ తరపు న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ కోర్టు ధర్మాసనాన్ని కోరారు.

మరోవైపు à°ˆ సభకు అనుమతి ఇవ్వడం వల్ల రెండు ప్రాంతాల మధ్య ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రభుత్వ న్యాయవాది సుధాకర్‌రెడ్డి కోర్టుకు వివరించారు. ఇరువురి వాదనలను విన్న కోర్టు రైతులు సభ నిర్వహించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

అటు తమ బహిరంగ సభకు కూడా అదే రోజు అనుమతి ఇవ్వాలని రాయలసీమ హక్కుల సాధన సమితి  హైకోర్టును కోరింది. అదే రోజు అమరావతి పరిరక్షణ సమితి బహిరంగ సభ ఉండటంతో మరుసటి రోజు సభ నిర్వహించుకోవాలని కోర్టు సూచించింది. 

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన పాదయాత్ర తిరుపతికి చేరుకుంది. రైతులు గోవింద నామస్మరణలతో అలిపిరి పాదాల మండపం నుంచి మెట్ల మార్గం, బస్సుల్లో తిరుమల సుపదం వద్దకు చేరుకున్నారు. ఈ సాయంత్రం 6 గంటల లోపు శ్రీవారిని దర్శించేందుకు రైతులకు టీటీడీ అవకాశం కల్పించింది. నవంబర్ 1న తుళ్లూరు హైకోర్టు నుంచి ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో 45 రోజుల పాటు కొనసాగింది. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ నిర్వహించాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది. పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది.