భారత్‌లో అమ్మాయిల పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంపు..

Published: Friday December 17, 2021

అమ్మాయిల పెళ్లి వయసు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహానికి చట్టబద్ధమైన కనీస వయసును 18 నుంచి 21ఏళ్లకు పెంచాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. బాల్య వివాహాల నిరోధక చట్ట సవరణ బిల్లును శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా à°ˆ అంశం హాట్ టాపిక్ అయింది. à°ˆ క్రమంలో ఇతర దేశాల్లో పరిస్థితులను ఒక్కసారి పరిశీలిస్తే..

 

అమెరికాలో 18ఏళ్లకు ఓకే

అగ్రరాజ్యం అమెరికా.. వివాహానికి చట్టబద్ధమైన కనీస వయసును 18 సంవత్సరాలుగా నిర్ణయించింది. 18ఏళ్లు నిండిన యువతి, యువకులు పెళ్లి చేసుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతిస్తుంది. అయితే అమ్మాయి తల్లిదండ్రులు(ఎవరో ఒకరైనా సరే) లేదా సంరక్షకుల సమ్మతితో 16/17 ఏళ్ల యువతి పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఆమె పెళ్లి చేసుకునే యువకుడికి మాత్రం 18ఏళ్లు కచ్చితంగా ఉండాల్సిందే. కానీ నెబ్రాస్కా, మిస్సిస్సిప్పి రాష్ట్రాల్లో కనీస వివాహ వయసు 19ఏళ్లు, 21 సంవత్సరాలు. 

 

బ్రిటన్‌లో కూడా 18ఏళ్లే కానీ..

యువతి, యువకులకు 18ఏళ్లను కనీస వివాహ వయసుగా బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. 18ఏళ్లు నిండిన యువతి, యువకులు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడానికి బ్రిటన్ ప్రభుత్వం అనుమతిస్తుంది. 16/17 ఏళ్ల యువతి, యువకులు తమ తల్లిదండ్రుల అనుమతితో వివాహం చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. ఇంతకంటే తక్కువ వయసు వాళ్లు పెళ్లి చేసుకోవడం అక్కడ నిషేధం.

 

డ్రాగన్ కంట్రీలో పరిస్థితి ఏంటంటే..

పక్క దేశం చైనాలో చట్టబద్ధమైన వివాహ వయసు యువతి, యువకులకు వేరువేరుగా ఉన్నాయి. యువకులకు లీగల్ మ్యారేజ్ ఏజ్ 22 సంవత్సరాలు. అమ్మాయిలకు వివాహ వయసును 20ఏళ్లుగా డ్రాగన్ కంట్రీ నిర్ణయించింది.