IRCTC మాదిరిగా సినిమా టికెట్లు
Published: Sunday December 19, 2021

సినిమా టికెట్ల విక్రయాల విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కంపెనీ ద్వారానే ఆన్‌లైన్ సినిమా టికెట్లను అమ్మాలని ఏపీ ప్రభుత్వం జీవో 142ని ఆదివారం జారీ చేసింది. అసెంబ్లీలో చేసిన చట్ట సవరణ ప్రకారం ఈ జీవోని అమల్లోకి తీసుకొస్తునట్లు చెప్పింది. ఇప్పటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాల బాధ్యతలను ఏపీ ఎఫ్డీసీకి (ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటివరకూ పేటీఎం, బుక్ మై షో, వంటి వాటి ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్ల అమ్మకాలు జరుతున్నాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. IRCTC మాదిరిగా త్వరలో ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేస్తోందని జీవోలో పేర్కొంది.

Share this on your social network: