ఏపీలో రెండో ఒమైక్రాన్‌ కేసు నమోదు

Published: Wednesday December 22, 2021

ఏపీలో రెండో ఒమైక్రాన్‌ కేసు నమోదయింది. తిరుపతిలో మహిళకు ఒమైక్రాన్‌ పాజిటివ్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కెన్యా నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి తిరుపతికి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఒమైక్రాన్‌ బాధిత మహిళను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.