జీవో నెంబర్ 2ను ఉపసంహరించుకున్న ఏపీ సర్కార్
Published: Tuesday January 04, 2022

జీవో నెంబర్ 2ను ఏపీ సర్కార్ ఉపసంహరించుకుంది. జీవో నెంబర్ 2పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. సర్పంచ్, కార్యదర్శుల అధికారాలను వీఆర్ఓలకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవో-2ను సస్పెండ్ చేస్తూ గతంలో ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. గతంలో ప్రభుత్వం వేసిన కౌంటర్‌లో కొన్ని లోపాలున్నాయని వాటిని సవరించుకునే లోపే కోర్టుకు వెళ్లారన్న మంత్రి వ్యాఖ్యలపై హైకోర్టు ప్రశ్నించింది. అందుకు భిన్నంగా ప్రభుత్వం వెకేట్ చేయాలని కోరడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో పిటిషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు న్యాయవాది ప్రకటించారు. తదుపరి విచారణను ఈనెల 20కి హైకోర్టు వాయిదా వేసింది.

Share this on your social network: