ఇటలీ నుంచి మరో విమానం.. 150 మంది ప్రయాణికులకు ‘పాజిటివ్’

Published: Friday January 07, 2022

 

ఇటలీ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వస్తున్న విమానాలు కరోనా మహమ్మారిని మోసుకొస్తున్నట్టుగా ఉన్నాయి. నిన్న ఇటలీ నుంచి అమృత్‌సర్‌కు వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో 125 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వీరందరి నుంచి నమూనాలు సేకరించిన అధికారులు జినోమ్ సీక్వెన్స్‌కు పంపారు. బాధిత ప్రయాణికులందరినీ ఐసోలేషన్‌లో ఉంచారు.

 

ఇది జరిగి ఒక్క రోజైనా కాకముందే ఇటలీ నుంచి నేడు అమృత్‌సర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న విమానంలో 150 మందికి కరోనా సోకినట్టు నిర్దారణ అయింది. విమానంలో మొత్తం 290 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరి నమూనాలను కూడా జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపనున్నట్టు తెలుస్తోంది. అలాగే, పాజిటివ్‌గా తేలినవారిని ఐసోలేషన్‌కు తరలించనున్నారు.