ఇసుక తవ్వకాలకు గేట్లెత్తేసినట్లే

Published: Saturday January 08, 2022
 

నీరు, నేల, చెట్ల సంరక్షణ కోసం 2002లో ప్రభుత్వం వాల్టాను రూపొందించింది. దానికి అన్ని శాఖలు కట్టుబడి ఉండాల్సిందే. à°ˆ చట్టానికి అనుగుణంగా పంచాయతీరాజ్‌ శాఖ 2004లో జారీ చేసిన జీవో 339లో పలు నిబంధనలు పేర్కొంది. వాగులు, వంకలు, నీటి చెలమలు, రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం విధించడం వాటిలో అత్యంత కీలకమైంది. ఎందుకంటే ఇసుక ఉండడం వల్లే అక్కడ భూగర్భ జలాలు ఉంటున్నాయి. పంచాయతీల్లో ఉన్న వాగులు, వంకలు, చిన్నపాటి నదుల్లో ఉన్న రీచ్‌లలో ఇసుక తవ్వేయడం మొదలుపెడితే... à°† ప్రభావం భూగర్భ జల మట్టాలపైనా పడుతుంది. నీటిని పట్టి ఉంచి భూమి పొరల్లో నిక్షిప్తం చేసే శక్తి ఇసుకకు ఉంది.

 

ఇసుక పొరలు తగినంతగా ఉంటేనే భూగర్భ జలం అడుగంటిపోకుండా ఉంటుంది. వర్షాలు లేకపోయినా, ఏటా నీరు పారకపోయినా వాగులు, వంకల్లో ఉన్న ఇసుక వల్ల భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండి à°† చుట్టుపక్కల ప్రాంతాల్లోని బోర్లలో నీళ్లు ఉంటాయి. తాగునీటికి కూడా ఇబ్బంది ఉండదు. అయితే ఇప్పుడా కీలక నిబంధనకు తూట్లు పొడిచారు. వాస్తవానికి 5వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అంటే దాదాపు 200 పెద్ద లారీల లోడ్‌తో సమానం.

 

కృష్ణా, గోదావరి నదుల్లోని పలు రీచ్‌లలో ఒక్కరోజులోనే ఇంతమేర ఇసుక తవ్వి తీస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చిన్న రేవులు, వాగులు, వంకల్లో ఇసుకతో పాటు భూగర్భజలాలూ తరిగిపోతాయి. ఎప్పుడైనా గ్రామస్థులు చిన్న ట్రాక్టర్లతో వాగుల్లో ఇసుక తోలుకుంటేనే వాల్టా à°•à°¿à°‚à°¦ కేసులు పెట్టేవారు. ఇప్పుడు ప్రభుత్వమే ఏకంగా చట్ట నిబంధనలకు సవరణలు తెచ్చింది. భూగర్భజలాలను నిలిపేందుకు తోడ్పడుతున్న చిన్న రీచ్‌లలో సైతం ఇసుకను తోడేసే అవకాశం ఇవ్వడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 

à°† అవసరం ఏమొచ్చింది? 

వాస్తవానికి ప్రభుత్వమే ఇసుక తవ్వకాలు చేపట్టినప్పుడు కూడా వాల్టా నిబంధనలు సవరించలేదు. ఉచితంగా ఇసుక ఇచ్చినప్పుడు కానీ, ఏపీఎండీసీ ద్వారా తవ్వకాలు చేసినప్పుడు కానీ ఎప్పుడూ చట్టం పరిధిలోకి పోలేదు. కానీ ఇప్పుడు à°’à°• ప్రైవేటు సంస్థకు ఇసుక తవ్వకాలు అప్పగించిన తర్వాత చట్టానికి తూట్లు పొడవాల్సిన అవసరం ఏమొచ్చిందని పర్యావరణ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఎవరి ప్రయోజనం కోసం ఇదంతా చేస్తున్నారన్న ప్రశ్నిస్తున్నారు. అనుమతించిన రీచ్‌లలో కూడా ఇసుక తవ్వకాలు అడ్డగోలుగా చేయకుండా నిబంధనలు ఉండేవి.

 

అయితే ఇప్పుడు వీటితో పాటు కొత్త రీచ్‌లలోనూ ఇష్టారాజ్యంగా తవ్వకాలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం సవరణ తీసుకురావడం దారుణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఇసుక ధరలను కొన్నిచోట్ల మూడు రెట్లు, మరికొన్ని చోట్ల నాలుగు రెట్లు పెంచేసిన ప్రభుత్వం... ఇప్పుడు పర్యావరణానికి, భూగర్భ జలాలకుతూట్లు పొడిచేలా చట్ట సవరణ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని, తెచ్చిన సవరణను వెనక్కి తీసుకోవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.