“ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి”.

ఏపీలో నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ‘‘ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి’’ అనే నినాదంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చందబాబు పిలుపునిచ్చారు. సోమవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలకు సమాధానం చెప్పలేక వైసీపీ డిఫెన్స్‌లో పడిందని అన్నారు. మైనింగ్ దోపిడీపై పూర్తిస్థాయి పోరాటానికి సిద్ధమవ్వాలని కేడర్‌కు ఆయన పిలుపునిచ్చారు. పీఆర్సీని పునఃసమీక్షించాలి, నిత్యావసరాల ధరలు తగ్గించాలని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే మైనింగ్ దోపీడీ జరుగుతోందని, తక్షణమే మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
‘‘మైనింగ్, మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియా ద్వారా వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. నాడు-నేడు కార్యక్రమాల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. వినుకొండలో మద్దతు ధర అడిగిన రైతుపై అక్రమ కేసు పెట్టడం దారుణం. పంచాయతీలలో జగన్ రెడ్డి విపరీతమైన పన్నుల భారాన్ని మోపారు. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీ నెరవేర్చాలి. సమగ్ర తాగునీటి పథకాల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Share this on your social network: