సీఎంలతో వర్చువల్‌గా సమావేశమైన ప్రధాని మోదీ
Published: Thursday January 13, 2022
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశం అయ్యారు. దేశంలో కోవిడ్ పరిస్థితిపై చర్చిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సమావేశం తర్వాత కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. తమిళనాడులో ఆదివారాలు లాక్‌డౌన్ కొనసాగుతోంది.

Share this on your social network: