ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్ వేగం పెంచింది. కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4,528 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. ఏపీలో 18,313 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా సోకింది. వైద్యుల సూచనల మేరకు ఆయన హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నారు. తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని అవంతి సూచించారు. తన నివాసానికి ఎవరూ రావద్దని, అత్యవసరమైతే ఫోన్‌లో సంప్రదించాలని కోరారు.
మరోవైపు సంక్రాంతి పండుగపై కరోనా వైరస్ ప్రభావం పడనుంది. ఉభయ రాష్ట్రాలతోపాటు పలు రాష్ర్టాలకు చెందిన ప్రజలు సంక్రాంతి పర్వదినాల నేపథ్యంలో సొంతూళ్లకు తరలి వస్తుండడంతో వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు సంక్రాంతి పర్వదినాల ముసుగులో కోడిపందేలు, గుండాటలు, పేకాట పోటీలు, రికార్డింగు డ్యాన్సులు వంటి వాటితోపాటు వివిధ ప్రాంతాల్లో ప్రభల ఉత్సవాల సందర్భంగా జరిగే తిరునాళ్లకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశముంది. దాంతో భారీగా జనసందోహాలు గుమిగూడి ఉండడం వల్ల ప్రధాన వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండ వచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది

Share this on your social network: