ఏపీలో కొత్తగా 13,819 కరోనా కేసులు

Published: Tuesday January 25, 2022

సంక్రాంతి  పండుగ తరువాత రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు బయడపడుతున్నాయి. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 13,819 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 12 మంది  మరణించారు. ఏపీలో మొత్తం 22,08,955 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు 14,561 మరణాలు సంభవించాయి.  ప్రస్తుతం ఏపీలో 1,01,396 యాక్టివ్ కేసులు ఉన్నాయి, 20,92,998 మంది కరోనా నుంచి రికవరీ చెందారు.