చలో విజయవాడ ఉద్యోగులకు సెలవుల కట్

Published: Wednesday February 02, 2022

 చలో విజయవాడను భగ్నం చేసేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. ఉద్యోగులను విజయవాడకు వెళ్లకుండా అడ్డుకునేందుకు వాళ్ల సెలవులను రద్దు చేసింది. ఫిబ్రవరి 3న విజయవాడ వెళ్లేందుకు పలువురు ఉద్యోగులు ముందుగానే సెలవులు పెట్టారు. అయితే ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఉద్యోగులకు సెలవులు ఇవ్వడం లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులకు సెలవులు ఇవ్వొదంటూ జిల్లా అధికారులకూ కూడా ఆదేశాలు వెళ్లాయి. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో ఏ ఒక్క ఉద్యోగి కూడా సెలవు అనుమతి ఇవ్వొద్దంటూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు జిల్లా కలెక్టర్ ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సెలవులు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉత్తర్వుల్లో కలెక్టర్ హెచ్చరించారు.