వీర సైనికులను మంచు తుఫాను మింగేసింది

Published: Tuesday February 08, 2022

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కమెంగ్ సెక్టార్‌లో గస్తీ విధులు నిర్వహిస్తూ ఆచూకీ తెలియకుండా పోయిన ఏడుగురు వీర సైనికులను మంచు తుఫాను మింగేసింది. వారి కోసం అన్వేషించేందుకు వెళ్లిన ప్రత్యేక సహాయ బృందాలకు వారి విగతజీవులై కనిపించినట్టు, వారి మృతదేహాలను కనుగొన్నట్టు ఆర్మీ ఉన్నతాధికారులు మంగళవారం తెలిపారు. సమీపంలోని ఆర్మీ ఫెసిలిటీకి వారిని తరలిస్తున్నట్టు చెప్పారు. ఈ జవాన్లంతా ఈనెల 6న మంచు తుఫాను దాటికి గల్లంతయ్యారు. వెంటనే ప్రత్యేక సహాయక బృందాలను రంగంలోకి దింపి విస్తృతంగా గాలించారు.