సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక

Published: Wednesday February 09, 2022

సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించింది. ఏసీ థియేటర్లలో కనీస ధర రూ.40, గరిష్ఠ ధర రూ.150à°—à°¾ ఉండాలని ప్రభుత్వానికి కమిటీ సిఫార్సు చేసింది. ఎయిర్‌కూల్‌ థియేటర్లకు కనీస ధర రూ.40, గరిష్ఠ ధర రూ.120à°—à°¾ ఉండాలని కమిటీ సూచన చేసింది. నాన్‌ ఏసీ థియేటర్లలో కనీస ధర రూ.30, గరిష్ఠ ధర రూ.70à°—à°¾ ఉండాలని కమిటీ తెలిపింది. కమిటీ నివేదికపై గురువారం రోజు సినీ ప్రముఖులతో సీఎం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా టికెట్ ధరలపై గురువారం హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ విచారణ చేపట్టనుంది. ఇప్పటికే మూడుసార్లు సమావేశమై టికెట్‌ ధరలపై కమిటీ చర్చించింది.