మొరాయిస్తున్న యంత్రాలు, సర్వర్లు.. టీచర్లకు బయోమెట్రిక్‌ హాజరు తంటాలు

Published: Thursday February 10, 2022

బడిలో టీచర్లకు బయోమెట్రిక్‌ అవస్థలు తప్పడంలేదు. యంత్రాలు, సర్వర్‌ మొరాయిస్తున్నాయి. దీనికితోడు ప్రభుత్వం రీచార్జి చేయించకపోవడంతో నెట్‌వర్క్‌ సమస్య తలెత్తుతోంది. ఇది బయో మెట్రిక్‌ కాదు.. ‘భయో’మెటిక్ర్‌ అని జిల్లా వ్యా ప్తంగా ఉపాధ్యాయులు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా వేలాది పాఠశాలల్లో ఈ యంత్రాలు మూలనపడ్డాయి. దీంతో బయోమెట్రిక్‌ వేయాలంటేనే టీచర్ల నానా తం టాలు పడాల్సి వస్తోంది. అయినా, జిల్లా వ్యాప్తంగా 4,428 మంది ఉపాధ్యాయులు బుధవారం బయోమెట్రిక్‌ వేశారని, రాష్ట్రంలో జిల్లాకు  4వ స్థానం దక్కిందని జిల్లావిద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

జిల్లావ్యాప్తంగా 3,542 బయోట్రిక్‌ యంత్రాలు, 1650 ఐ రిష్‌ యంత్రాలు ఉన్నాయి. గత ఏడాది చివరి నాటికి కేవలం 1,250 మాత్రమే పని చేసేవని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కొవిడ్‌ మొదలయ్యాక ఎ క్కువ రోజులు పాఠశాలలు మూతబడ్డాయి. పునఃప్రారంభమైన తర్వాత కూడా ప్రభుత్వం వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీంతో చాలా బయోమెట్రిక్‌, ఐరిష్‌ యం త్రాలు మూలనపడ్డాయి. గతంలో ఎక్కడైన యంత్రాలు పనిచేయకుంటే డీఈఓ  కార్యాలయానికి తీసుకువెళ్లేవా రు. అక్కడ ఓ ప్రైవేట్‌ ఏజెన్సీ సిబ్బందికి ఇచ్చి బాగు చేయించేవారు. ఇప్పుడు డీఈఓ కార్యాలయానికి తీసుకువెళితే మూలన పడేస్తున్నారు. వాటికి మరమ్మతులు చేయించే ప్రైవేట్‌ ఏజె న్సీ ఏడాదిన్నర నుంచి స్పందించడం మానేసింది. ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి ప్రతిఫలం అందడం లేదని, అందుకే ఏజెన్సీ తన సేవలు నిలిపేసిందని అం టున్నారు. 

జిల్లా వ్యాప్తంగా 70 నుంచి 80 శాతం యంత్రాలు చెడిపోయాయి. జిల్లా కేంద్రంలోని కొత్త బాయ్స్‌ హైస్కూల్‌లో డివైజ్‌లు పనిచేయడం లేదు. శారదా మున్సిపల్‌ స్కూల్‌లో డివైజైలు పనిచేస్తున్నా... సర్వర్లు మొరాయిస్తున్నాయి. పొట్టిశ్రీరాములు మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్కూల్‌లో  యంత్రాలు ఆన్‌ కూ డా కావడం లేదు. జిల్లా కేంద్రంలోనే ఇలా ఉంటే, మారుమూల ప్రాంతాల్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. యం త్రాలను పనితీరును పట్టించుకోకుండా, బయోమెట్రిక్‌ హాజరు వేయాలని ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదేశించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి