డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై బదిలీ వేటు..

Published: Tuesday February 15, 2022

 ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై బదిలీ వేటు పడింది. జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని గౌతమ్‌ సవాంగ్‌కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.  ప్రభుత్వం గౌతమ్‌ సవాంగ్‌కి ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. 1992 బ్యాచ్‌కి చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి 2026 ఏప్రిల్‌ 30 వరకు విధుల్లో ఉండే అవకాశముంది. ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో ముగ్గురి పేర్లతో.. కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఏపీ ప్రభుత్వం డీజీపీగా కసిరెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించనుంది.