ఏపీలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం

Published: Tuesday February 15, 2022

ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో ఇశాళ కొత్తగా 615 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్‌తో నలుగురు మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తం 23,13,827 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో 14,702 మంది మరణించారు. అలాగే రాష్ట్రంలో 12,550 యాక్టివ్‌ కేసులు ఉండగా, 22,86,575 మంది రికవరీ అయ్యారు.