పిల్లలకూ హెల్మెట్ తప్పనిసరి
Published: Wednesday February 16, 2022

ఇండియాలో ఇక నుంచి ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే పిల్లలు కూడా హెల్మెట్లు ధరించాల్సిందే. వారికి కూడా హెల్మ్‌ట్లను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పిల్లల సైజుకు తగ్గట్టుగా హెల్మెట్లు తయారు చేయాలని హెల్మెట్ తయారీదారులను కేంద్రం ఆదేశించింది. పిల్లల భద్రత దృష్ట్యా హెల్మెట్లు ధరించడం తప్పనిసరి చేసినట్టు కేంద్రం చెబుతోంది. ఈ కొత్త నిబంధనను అతిక్రమించినట్టే రూ.1,000 జరిమానా విధించడంతో పాటు డ్రైవర్ లైసెన్స్‌ను 3 నెలల పాటు సస్పెండ్ చేస్తారు.

Share this on your social network: